శాంతి చంద్ర, దీపిక సింగ్, శిమ్రితీ బతీజా, నిక్కిషా రంగ్వాలా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డర్టీ ఫెలో’. ఈ చిత్రాన్ని రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జీఎస్ బాబు నిర్మిస్తున్నారు. ఆడారి మూర్తి సాయి దర్శకుడు.
ఈ చిత్ర టైటిల్ అనౌన్స్మెంట్ కార్యక్రమంలో హీరో శాంతి చంద్ర మాట్లాడుతూ…‘తండ్రీ కొడుకుల మధ్య సాగే యాక్షన్ డ్రామా చిత్రమిది. తండ్రి తన కొడుకును సరైన మార్గంలో పెట్టకపోతే ఆ కొడుకు సమాజానికి ఎలా హానికరంగా తయారయ్యాడు అనేది ఈ చిత్రంలో చూపిస్తున్నాం’ అన్నారు. ఈ సినిమాలో సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు దర్శకుడు ఆడారి మూర్తి సాయి అన్నారు.