shanmukh jaswanth | బిగ్ బాస్ 5 తెలుగు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతుంది. మొదట్లో కాస్త చప్పగానే సాగినట్లు అనిపించినా కూడా ఇప్పుడు మాత్రం రసవత్తరంగా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా 8 వారాల తర్వాత కానీ బిగ్ బాస్ అసలైన టాస్కులు ఇవ్వడం లేదు. ఇంట్లోకి రావాలంటేనే టాస్కులు గెలిచే టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్. ఈ వారం కెప్టెన్పీ పోటీదారులు ఏకంగా అరడజన్ మంది ఉన్నారు. అందులో మానస్, షణ్ముఖ్ జస్వంత్, ఆనీ మాస్టర్, సన్నీ, సిరి హనుమంతు ( siri hanumanth ) ఇంకా శ్రీరామచంద్ర ఉన్నారు. అందరూ ఒక్కొక్క టాస్కులో గెలిచి కెప్టెన్సీ కావడానికి అర్హత సాధించారు. ఇప్పటి వరకు కనీసం ఒక్కసారి కూడా కెప్టెన్సీ కంటెండర్ కూడా కాలేకపోయిన షణ్ణు ఈ సారి ఇంటి కెప్టెన్‌గా ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులో శ్రీరామచంద్ర దెబ్బకు సన్నీ, మానస్ ఇద్దరూ కెప్టెన్సీ నుంచి ఔట్ అయిపోయారు. ఇది ప్రోమోలోనే క్లియర్‌గా తెలిసిపోతుంది. అలాగే శ్రీరామ్ కూడా తర్వాత ఓడిపోతాడు. చివరికి సిరి, ఆనీ మాస్టర్, షణ్ముఖ్ మిగలగా.. అందులోనూ సిరి, ఆనీ ఓడిపోయి షణ్ణు ఇంటి కెప్టెన్‌గా ఎంపికవుతాడని తెలుస్తుంది. ఆయన కెప్టెన్ అయిన వెంటనే రేషన్ మేనేజర్‌గా ఎవర్ని తీసుకుంటాడనే డిస్కషన్ కూడా వచ్చింది. అయితే అంతా ఊహించినట్లు తన ఫ్రెండ్స్ జెస్సీ, సిరి కాకుండా ఆనీ మాస్టర్‌కు ఆ అవకాశం ఇచ్చాడు షణ్ణు. ఇప్పటి వరకు ఇంటి కెప్టెన్ కాని షణ్ముఖ్ తన మార్క్ చూపించాలని చూస్తున్నాడు.
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నా ఈజీగానే సేవ్ అవుతాడు ఈ కుర్రాడు. ఎందుకంటే మనోడికి బయట ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. కెప్టెన్ అయిన తర్వాత అనూహ్య నిర్ణయాలు తీసుకోడానికి సిద్ధమవుతున్నాడు షణ్ముఖ్. అంతేకాదు ఆనీ మాస్టర్‌ను రేషన్ మేనేజర్‌గా ఎంపిక చేసుకోడానికి కారణం ఆమె ముందు నుంచి కిచెన్ లోనే ఉండటం అని చెప్పాడు షణ్ణు బాబు. మొత్తానికి ఇంటికి వచ్చిన 8 వారాల్లో ఒక్కసారి కూడా కెప్టెన్ కాలేకపోయాడు షణ్ముఖ్ జస్వంత్. ఈ వారం కెప్టెన్సీ రావడంతో వచ్చే వారం ఇమ్యూనిటీ పొందుతాడు ఈయన. ఈ వారం సేవ్ అయితే మరో రెండు వారాలు షణ్ణు ఇంట్లో ఉండటం ఖాయం అన్నమాట.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Anchor Ravi : నేను వెళ్లిపోతా బయటకు పంపండన్న రవి
siri hanumanth : సిరి-షణ్ముఖ్ వ్యవహారం శృతిమించుతున్నట్టుగా ఉందే..!
Bigg Boss 5 telugu : ఆరుబయట పడుకున్న హౌజ్‌మేట్స్.. !
Shanmukh jaswanth: అమ్మ నువ్వు క్యాన్సర్ జయించావు.. నేను ఈ బాధ నుండి బయటపడతా: షణ్ముఖ్