Shahrukh khan | అమీర్ ఖాన్ సినిమాలో షారుక్ ఖాన్..క్రేజీ ట్రాక్‌లో నిజమెంత..!
లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha) ఆగస్టు 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అమీర్ ఖాన్ అండ్ టీం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
బాలీవుడ్ (Bollywood) స్టార్ అమీర్ ఖాన్ (Aamir khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం లాల్ సింగ్ చడ్డా (Laal Singh Chaddha). హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఆగస్టు 11న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే అమీర్ ఖాన్ అండ్ టీం దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shahrukh khan) ఈ చిత్రంలో కీ రోల్లో కనిపించబోతున్నాడని ఓ అప్డేట్ బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
కథానుగుణంగా స్టార్ హీరో చేయాల్సిన ఓ అతిథి పాత్ర ఉండటంతో..తన స్నేహితుడు షారుక్‌ను అమీర్ ఈ సినిమాలోకి తీసుకొచ్చినట్టు టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇద్దరు బడా స్టార్ హీరోలను సిల్వర్ స్క్రీన్‌పై కలిసి చూడాలనుకునే మూవీ లవర్స్ కు మాత్రం గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.
టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య కీ రోల్ పోషిస్తున్నాడు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్టులో కరీనా కపూర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. తెలుగు వెర్షన్‌ను టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తుండటం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

