Shah Rukh Khan | బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, యువ నటుడు విక్కీ కౌశల్ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్పలోని ఊ అంటావా మావా.. ఊ ఊ అంటావా మావా పాటకు స్టెప్పులేశారు. సమంతలా షారుఖ్ వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
యూఏఈ రాజధాని అబుదాబిలో ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుల వేడుకకు హోస్ట్‌గా చేస్తున్నారు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్. అయితే ఈ ఈవెంట్లో భాగంగా వీళ్లిద్దరు కలిసి పుష్ప పాటకు డాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై పుష్ప చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ స్పందిస్తూ.. ఇది అసలైన ఫైర్ అంటే. ఊ అంటావా మావా పాటతో కింగ్ ఖాన్ వేదికకు నిప్పటించాడు అంటూ రాసుకోచ్చింది.
Yeh tho asli FIRE hey 🔥🔥
KING KHAN @iamsrk & @vickykaushal09 set the stage on FIRE 🔥😄 pic.twitter.com/bpqUL40hgk
— Mythri Movie Makers (@MythriOfficial) September 28, 2024