అమరావతి : భారతీయ సినిమాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మభూషణ్ గ్రహీత రాజ్‌కపూర్ ( Raj Kapoor) చేసిన కృషి ఎనలేనిదని ఏపీ డిప్యూటీ సీఎం, ప్రముఖ సినీనటుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. రాజ్‌కపూర్ శత జయంతి ( centenary celebrations ) ఉత్సవాల సందర్భంగా పవన్‌కల్యాణ్ ట్వీటర్ వేదిక ద్వారా నివాళి అర్పించారు.
‘ ది షోమ్యాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ గుర్తింపు పొందిన రాజ్‌కపూర్ భారతీయ సినిమాకు (Indian Cinema) అందించిన అపారమైన సేవలకు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. తన అసాధారణమైన నటనతో హిందీ చిత్ర పరిశ్రమను (Hindi Film Industry) పునర్నిర్మించారని తెలిపారు.
మూడు జాతీయ అవార్డులు, 11 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సొంతం చేసుకుని అంతర్జాతీయ గుర్తింపు పొందారని కొనియాడారు. అతని టైమ్‌లెస్ క్లాసిక్ ‘ ఆవారా’ మూవీ (Awara Movie ) నేటికి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తూనే ఉందని తెలిపారు. కపూర్ కుటుంబం రాజ్‌కపూర్ వారసత్వాన్ని నిలబెట్టిందని కొనియాడారు.