Sankranthiki Vasthunam | విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) కథానాయకుడిగా వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.
జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. కేవలం 5 రోజుల్లో రూ.160 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇంకో వారంలో రూ.200 క్రాస్ చేసేలా ఉంది ఈ చిత్రం. అయితే ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించిన సందర్బంగా ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాకు మేకర్స్ సీక్వెల్‌ను ప్రకటించినట్లు తెలుస్తుంది. అదే పాత్రలతో వేరే కథను దీనికి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నట్లు దర్శకుడు తెలిపాడు. మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం (Malli Sankranthiki Vasthunam) అంటూ ఈ సినిమా రాబోతుండగా.. ఈ సినిమాను కూడా వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తామని వెల్లడించాడు. కాగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్లారిటీ రావడానికి మరికొన్ని వెయిట్ చేయాల్సి ఉంది.
‘Malli’ #SankranthikiVasthunam pic.twitter.com/rAUkRyDvZP
— Aakashavaani (@TheAakashavaani) January 19, 2025