Kodali Bosu Babu | టాలీవుడ్లో మరో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నిర్మాత కొడాలి బోసుబాబు మృతి చెందాడు. గుండెపోటుతో ఆదివారం తన నివాసంలో తుది శ్వాస విడిచాడు. ఈయన దాసరి నారాయణ రావుకు దగ్గరి బంధువు. మొదట ఈయన దాసరి సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా పనిచేశాడు. తర్వాత నిర్మాతగా మారి పలు హిట్ సినిమాలను నిర్మించాడు. ఈయన మృతి పట్ల పలువురు టాలీవుడ్ సినీప్రముఖులు సంతాపం తెలియజేశారు.
టాలీవుడ్ పలువురు సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అక్కినేని నాగేశ్వరరావుతో ‘రాగదీపం’. కృష్ణ, ఏఎన్ఆర్ మల్టీస్టారర్ ‘ఊరంతా సంక్రాంతి’, కృష్ణతో ‘ప్రజాప్రతినిధి’, శోభన్ బాబుతో ‘జీవనరాగం’, దాసరి నారాయణ రావు దర్శకత్వంలో మోహన్‌బాబు హీరోగా తెరకెక్కిన ‘పోలీస్ వెంకటస్వామి’ వంటి చిత్రాలను తెరకెక్కించాడు.