Ramba Oorvasi Menaka | మళ్లీ పాత రూట్లోకి అల్లరి నరేష్.. పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫస్ట్ లుక్ రిలీజ్!
Allari Naresh | టాలీవుడ్ సీనియర్ హీరో, కామెడీ కింగ్ అల్లరి నరేష్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని తన అభిమానులకు ఆయన ఒక అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.
Allari Naresh | టాలీవుడ్ సీనియర్ హీరో, కామెడీ కింగ్ అల్లరి నరేష్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. అయితే ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకుని తన అభిమానులకు ఆయన ఒక అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. తన కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 65వ సినిమా టైటిల్‌ను, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అధికారికంగా ప్రకటిస్తూనే, సినిమా విడుదల తేదీని కూడా మేకర్స్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి ‘రంభ ఊర్వశి మేనక’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సరికొత్త సోషియో ఫాంటసీ కామెడీ ఎంటర్టైనర్ను సెప్టెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అత్యంత ఘనంగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. గత కొంతకాలంగా సీరియస్ ఎమోషనల్ కథలతో అలరించిన నరేష్, చాలా విరామం తర్వాత మళ్లీ తన మార్క్ హిలేరియస్ ఎంటర్టైనర్తో రాబోతుండటంతో ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ చిత్రానికి చంద్ర మోహన్ చింతడ దర్శకత్వం వహిస్తుండగా, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ కలయికలో వస్తున్న మొదటి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. ‘యముడికి మొగుడు’ సినిమా తర్వాత దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం అల్లరి నరేష్ మళ్లీ ఒక ఫాంటసీ జానర్ వైపు అడుగులు వేస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి “కామెడీ గోస్ కాస్మిక్” అనే ఒక క్రేజీ ట్యాగ్‌లైన్‌ను కూడా జత చేశారు, ఇది సినిమాలోని వినోద స్థాయి ఏ రేంజ్లో ఉండబోతోందో ముందే హింట్ ఇస్తోంది.
ఇక తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే, ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆకాశంలో మేఘాల మధ్య దేవలోకానికి వెళ్లే మెట్లపై అల్లరి నరేష్ ఎంతో స్టైలిష్‌గా కూర్చుని ఉండటం, ఆయన చేతిలో రంభ, ఊర్వశి, మేనకల పేర్లు రాసి ఉన్న ఒక పురాతన శాసనం పట్టుకుని ఉండటం పోస్టర్లో కనిపిస్తోంది. అలాగే ఆయన చుట్టూ మేఘాలలో అప్సరసలు విహరిస్తున్న దృశ్యం ఫాంటసీ ఎలిమెంట్స్‌ను అద్భుతంగా ఎలివేట్ చేస్తోంది. రంగురంగుల గ్రాఫిక్స్‌తో, వైవిధ్యమైన డిజైన్‌తో ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇంద్రలోకానికి, భూలోకానికి మధ్య జరిగే ఒక మాయాజాలం, అందులో నుంచి పుట్టే కడుపుబ్బ నవ్వించే కామెడీ, ఊహించని ట్విస్టులతో ఈ సినిమా సాగనుందని స్పష్టమవుతోంది.
ఈ భారీ విజువల్ కామెడీ డ్రామాలో వెన్నెల కిషోర్, నరేష్ వికె, శ్రీనివాస్ రెడ్డి, మురళీధర్ గౌడ్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అల్లరి నరేష్ వింటేజ్ కామెడీ టైమింగ్‌కు తోడు ఫాంటసీ కథాంశం తోడవడంతో, సెప్టెంబర్ 4న బాక్సాఫీస్ వద్ద నవ్వుల పండగ ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

