Kutti Padmini | సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఇప్పుడు చాలామంది నటులు నోరువిప్పుతున్నారు. సినిమాల్లో అవకాశాలు కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని పలువురు అడిగారంటూ బయటపెడుతున్నారు. అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడే కాదు పాత కాలంలోనూ ఉండేదట. ఈ విషయాన్ని సీనియర్ నటి కుట్టి పద్మిణి బయటపెట్టింది. తమతో రూంలో అడ్జస్ట్ అవ్వాలని అడిగారని పేర్కొంది.
మూడేళ్ల వయసులోనే సినిమాల్లోకి వచ్చిన కుట్టి పద్మిని తమిళంలో చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించింది. ఎంజీఆర్, శివాజీ గణేశన్, జైశంకర్ వంటి చాలామంది సినిమాల్లో నటించింది. తమిళనాడు నుంచి జాతీయ ఉత్తమ బాలనటి అవార్డు గెలుచుకున్న మొదటి వ్యక్తి కూడా ఈమెనే. బాలనటి తర్వాత హీరోయిన్గా కెరీర్ మొదలుపెట్టే సమయంలో తనకు దర్శకుల నుంచి వేధింపులు వచ్చాయని తెలిపింది.
శోభన్‌బాబుతో ఎక్కువగా నటించడంతో అతనితో చనువు ఏర్పడిందని గుర్తుచేసుకుంది. చిన్నతనం నుంచి సినిమాల్లోనే ఉండటంతో చదువుకోవడం వీలుకాలేదని చెప్పింది. కానీ చదువుకోకపోయినా పైకి రావాలో శోభన్ బాబు చెప్పారని తెలిపింది. ఆడపిల్లలు ఎలా డెవలప్ అవ్వాలో ఆయన ఇచ్చిన సలహాలతో మంచి స్థాయికి ఎదిగానని చెప్పింది. ప్రస్తుతం 140 మందికి జీతాలు ఇచ్చే స్థాయికి చేరుకున్నానని చెప్పుకొచ్చింది. ‘ ఎవరైతే నన్ను రూమ్‌లో అడ్జస్ట్ అవ్వాలని పిలిచారో వాళ్లకే సాయం చేస్తున్నా. ‘ అని తెలిపింది. ఇది చాలా సంతృప్తిని ఇచ్చిందని పేర్కొంది. ఇక తన భర్తతో విడిపోవడానికి గల కారణాలను కూడా ఈ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తన భర్త పెళ్లయిన 22 ఏళ్లకు తన సెక్రటరీని లవ్ చేశాడని బయటపెట్టింది. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత అలా చేస్తే కోపం వస్తుంది కదా.. అలాంటి టైమ్‌లో అడ్జస్ట్ అయినా అవ్వాలి.. లేదా ఒంటరిగా అయినా ఉండాలని తెలిపింది. అందుకే తాను అడ్జస్ట్ అవ్వలేక ఒంటరిగా ఉంటున్నా అని చెప్పింది.