AB4 | ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ సినిమాలో అలనాటి హీరోయిన్ కూతురు.. స్టైలిష్ లుక్ వైరల్
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి కాంపౌండ్ నుంచిబోతున్న చిత్రం AB4. ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ రషా తడని పోస్టర్ విడుదల చేసింది అజయ్ భూపతి టీం. మోడ్రన్ లుక్‌లో బైక్‌పై స్టైలిష్‌గా కూర్చున్న లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
AB4 | మహేశ్ బాబు సోదరుడు, దివంగత నటుడు రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి కాంపౌండ్ నుంచి AB4గా రాబోతున్న ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించబోతున్నారనే దానిపై క్లారిటీ వచ్చేసింది. అలనాటి అందాల హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రషా తడనిని హీరోయిన్గా ఫైనల్ చేశాడు అజయ్ భూపతి. ఈ విషయాన్ని ప్రకటిస్తూ రషా తడని పోస్టర్ విడుదల చేసింది అజయ్ భూపతి టీం.
మోడ్రన్ లుక్‌లో బైక్‌పై స్టైలిష్‌గా కూర్చున్న లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. రషాకు ఇది టాలీవుడ్లో తొలి సినిమా. రషా కోసం అజయ్ భూపతి చాలెంజింగ్ రోల్‌ను సిద్దం చేశాడని ఇన్సైడ్ టాక్. అజయ్ భూపతి సినిమాలంటే హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని తెలిసిందే. మరి ఈ సారి రషా తడనిని ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
AB4 రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో షురూ కానుంది. చందమామ కథలు పిక్చర్స్ బ్యానర్‌పై జెమినీ కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అశ్వినిదత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తిరుపతి విజువల్స్ ఉండటంతో ఈ కథ ఆ ప్రాంతం చుట్టూ తిరుగుతుందని అర్థమవుతుండగా.. దీనిపై డైరెక్టర్ అండ్ మేకర్స్ టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. రవీనా టాండన్, అనిల్ తడని కూతురైన రషా తడని ఇప్పటికే హిందీలో పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఆజాద్‌లో మెరిసింది. రషా తడని నటించిన Uyi Amma సాంగ్ వైరల్ అయింది.
Make way for the Gorgeous & Talented #RashaThadani in to Telugu Cinema ❤️🔥
Stay tuned to witness her magnetic screen presence and performance in #AB4 ❤️
Starring 🌟#JayaKrishnaGhattamaneni
Presented by @AshwiniDuttCh
Produced by @gemini_kiran under @CKPicturesoffl… pic.twitter.com/g6NdzrmlIE— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 17, 2025
Read Also :
IFFI | సినీ ఇండస్ట్రీలో 50 ఏళ్లు పూర్తి.. రజినీకాంత్, బాలకృష్ణకు అరుదైన గౌరవం
Manchu Lakshmi | మంచు లక్ష్మీ నో ఫిల్టర్ కామెంట్స్ వైరల్ .. సినీ పరిశ్రమ, సమాజంపై బాంబుల వర్షం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

