Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
Scene | తమిళనాడు సినిమా అభిమానులకు తెల్లవారుజాము షోలు అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద సందడి మొదలయ్యేది. అభిమానులు భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, డప్పుచప్పుళ్లతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం సృష్టించేవారు.
Scene | తమిళనాడు సినిమా అభిమానులకు తెల్లవారుజాము షోలు అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్నాయంటే అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద సందడి మొదలయ్యేది. అభిమానులు భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, డప్పుచప్పుళ్లతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం సృష్టించేవారు. అయితే కొన్నేళ్లుగా తమిళనాడులో ఈ సందడి తగ్గిపోయింది. ఉదయం 9 గంటల తర్వాతే సినిమాల ప్రదర్శనకు అనుమతి ఉండటంతో తెల్లవారుజాము ఆటలకు తెరపడింది. ఇప్పుడు సూర్య నటిస్తున్న ‘సీన్’ సినిమాతో ఈ పాత సంప్రదాయం మళ్లీ ప్రారంభం కావచ్చనే చర్చ కోలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
గతంలో అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలైనప్పుడు అభిమానుల మధ్య పోటీ తీవ్రంగా ఉండేది. ముఖ్యంగా అజిత్ నటించిన ‘తునివు’, విజయ్ నటించిన ‘వారిసు’ సినిమాల విడుదల సమయంలో ఈ పోటీ తారస్థాయికి చేరింది. ఆ సమయంలో జరిగిన అభిమానుల సందడి, తొక్కిసలాట తరహా పరిస్థితుల మధ్య ఓ అభిమాని ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన తర్వాత భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని తమిళనాడు ప్రభుత్వం తెల్లవారుజాము షోలను రద్దు చేసింది. అప్పటి నుంచి ఉదయం 9 గంటల తర్వాతే థియేటర్లలో ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తున్న చర్చ ప్రకారం.. సూర్య నటిస్తున్న ‘సీన్’ సినిమాకు తెల్లవారుజాము షోలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఒకవేళ ఈ సినిమాతో ముందస్తు షోలకు అనుమతి లభిస్తే, తమిళ సినీ పరిశ్రమలో మరోసారి పాత రోజుల సందడి కనిపించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ చిత్రాలకు, అగ్ర హీరోల సినిమాలకు ఈ విధానం ఎంతో ప్రయోజనం చేకూర్చవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో నజ్రియా ఫహాద్ కథానాయికగా కనిపించనున్నారు. నస్లెన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సూర్య, జీతు మాధవన్‌తో పాటు ఝగరం స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని సుశిన్ శ్యామ్ అందిస్తున్నారు. ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.నవంబర్ 6న ‘సీన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | సూర్య ‘సీన్’ సినిమాతో తమిళనాడులో మళ్లీ తెల్లవారుజాము షోలు .. కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ!
AP News | టీడీపీలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే అప్పల నాయుడు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ సెంచరీ.. ఇండియా టార్గెట్ 260
మద్దూరును కరువు మండలంగా ప్రకటించాలి.. మండల సభను బహిష్కరించిన సర్పంచులు
Eetha Trailer | ‘ఛావా’ దర్శకుడి కొత్త సినిమా.. శ్రద్ధా కపూర్ ‘ఈఠా’ ట్రైలర్ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

