Karthik Aryan | ఆసక్తికరంగా కార్తిక్ ఆర్యన్ సత్యప్రేమ్ కీ కథ మూవీ టీజర్..!
SatyaPrem ki katha Teaser | బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. గతేడాది భూల్ భూలయ్య-2తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన కార్తిక్.. అదే జోరును తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు.
SatyaPrem ki katha Teaser | బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. గతేడాది భూల్ భూలయ్య-2తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన కార్తిక్.. అదే జోరును తరువాత సినిమాల్లో కంటిన్యూ చేయలేకపోయాడు. ఈ ఏడాది విడుదలైన షెహజాదా బాలీవుడ్ బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ సత్య ప్రేమ్ కీ కథ సినిమాపైనే ఉన్నాయి. సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి హైప్ తీసుకొచ్చాయి. తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.
రోమ్ కామ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఎమోషన్స్ గట్టిగా దట్టించినట్లు తెలుస్తుంది. కార్తిక్ ఆర్యన్, కియారా అద్వాణీ కెమెస్ట్రీ బాగా కుదరినట్లు కనిపిస్తుంది. భూల్ భూలయ్య-2 తర్వాత మళ్లీ ఈ జోడీ కనిపించనుడంటంతో ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. నదియా వాలా గ్రాండ్సన్ ఎంటర్టైనమెంట్స్, నమహా పిక్చర్స్ ప్రొడక్షన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Aansoo uske ho…par…Aankhein meri ho
#SatyaPremKiKatha 🤍#29thJune https://t.co/j3srg7HFVv… #SajidNadiadwala @advani_kiara @sameervidwans @shareenmantri @kishorarora19 @karandontsharma @NGEMovies @namahpictures @WardaNadiadwala @DoP_Bose @PenMovies… pic.twitter.com/LvukHwrlZb— Kartik Aaryan (@TheAaryanKartik) May 18, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

