Venkatesh Maha – SatyaDev | యువ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం రావుబహదూర్ (RaoBahadur). ఈ సినిమాకు ‘కేరాఫ్ కంచరపాలెం’ ,’ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్ మహా(Venkatesh Maha) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా టీజర్ అప్డేట్ను పంచుకుంది. ఈ సినిమా టీజర్‌ను సోమవారం(ఆగష్టు 18)న దిగ్గజ దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో సత్యదేవ్ రావు బహదుర్ అనే జమీందార్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. జీఎంబీ, శ్రీచక్ర ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై అనురాగ్ రెడ్డి, చింత గోపాలకృష్ణ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
When the Master of Epic Stories @ssrajamouli Sir launches your teaser… you know it’s destined for greatness.
⁰#Raobahadur teaser on 18th August !! @mahaisnotanoun @GMBents @SrichakraasEnts @AplusSMovies #rajamouli pic.twitter.com/EY2jTOEvyY— Satya Dev (@ActorSatyaDev) August 16, 2025