Rao Bahadur | సత్యదేవ్ ‘రావు బహదూర్’ విడుదల వాయిదా.. కొత్త డేట్ ఫిక్స్!
Rao Bahadur | వెర్సటైల్ నటుడు సత్యదేవ్, విలక్షణ దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా 'రావు బహదూర్' విడుదల తేదీ మరోసారి మారింది.
Rao Bahadur | వెర్సటైల్ నటుడు సత్యదేవ్, విలక్షణ దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ సైకలాజికల్ డ్రామా ‘రావు బహదూర్’ విడుదల తేదీ మరోసారి మారింది. ఈ చిత్రాన్ని తొలుత జూన్ 5న విడుదల చేయాలని చిత్ర బృందం భావించినప్పటికీ, జూన్ 4న రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదల కానున్న నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద క్లాష్‌ను తప్పించడానికి మేకర్స్ వెనక్కి తగ్గారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం జూలై 3, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్ ‘జీఎంబీ ఎంటర్టైన్మెంట్’ ద్వారా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకటేష్ మహా దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే మరియు ఎడిటింగ్ బాధ్యతలను కూడా స్వయంగా నిర్వహిస్తున్నారు. సత్యదేవ్ సరసన దీపా థామస్ కథానాయికగా నటిస్తుండగా, వికాస్ ముప్పాల, బాల పరాశర్, ఆనంద్ భారతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒక పురాతన రాజవంశం, వారసత్వం మరియు రహస్యాల చుట్టూ తిరిగే గ్రిప్పింగ్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సత్యదేవ్ పవర్ ఫుల్ ఎల్డర్లీ లుక్‌లో కనిపించబోతున్నారు. ‘అనుమానం పెనుభూతం’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే విడుదలైన పోస్టర్లు మరియు ‘ఓ సుందరి’ సాంగ్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి.
ᴀ ɴᴇᴡ ᴅᴀᴛᴇ.
ᴀɴ ᴜɴꜰᴏʀɢᴇᴛᴛᴀʙʟᴇ ᴄɪɴᴇᴍᴀ ᴇxᴘᴇʀɪᴇɴᴄᴇ.#RaoBahadur in cinemas worldwide from 𝟑𝐫𝐝 𝐉𝐔𝐋𝐘 𝟐𝟎𝟐𝟔 ❤🔥𝗥𝗔𝗢 𝗕𝗔𝗛𝗔𝗗𝗨𝗥 / రావు బహదూర్
Remember – “Doubt is a Demon” |😈| “అనుమానం పెనుభూతం” #రావుబహదూర్ #RB 🔥#RaoBahadurOnJuly3rd pic.twitter.com/tbQOWD4EYV
— GMB Entertainment (@GMBents) May 8, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

