Satyabhama | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన కాజల్ ‘సత్యభామ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
Satyabhama | టాలీవుడ్ కథానాయిక కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’ (Satyabhama)’. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించాడు. జూన్ 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
Satyabhama | టాలీవుడ్ కథానాయిక కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘సత్యభామ’ (Satyabhama)’. నవీన్ చంద్ర కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించాడు. జూన్ 07న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై నెల కూడా కాకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ చిత్రంలో కాజల్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటించగా.. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ టిక్క సమర్పకులుగా వ్యవహరించారు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కె.సత్యభామ (Kajal Aggarwal) షీ టీమ్‌లో ఏసీపీ ఆఫీసర్‌గా పనిచేస్తుంటుంది. చూడటానికి నార్మల్‌గా కనిపించినా.. అమ్మాయిలను ఏడిపించే వాళ్ళను, అమ్మాయిలకు సమస్యలు సృష్టించే వాళ్లను బెండు తీస్తు ఉంటుంది. అయితే ఈ క్రమంలోనే తన దగ్గరకు ఓ రోజు హసీనా(నేహా పఠాన్) అనే అమ్మాయి వచ్చి తన భర్త (అనిరుధ్ పవిత్రన్)తో తనకు డివోర్స్ అయినా రోజూ ఇబ్బంది పెడుతున్నాడని, ఫిజికల్ గా కూడా టార్చర్ చేస్తున్నట్లు కంప్లయింట్ ఇస్తుంది. అయితే కంప్లయింట్ ఇచ్చిన విషయం తెలుసుకున్న ఎదు హసీనా ఇంటికి వచ్చి ఆమె మీద దాడి చేసి చంపేస్తాడు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన సత్యభామ కోపంతో ఎదుని కాల్చబోయి తన గన్ లో బులెట్స్ వేస్ట్ చేస్తుంది. దీంతో ఆమె నుంచి గన్ సరెండ్ చేయించి షీ టీమ్స్ నుంచి వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ ఫర్ చేస్తారు పై అధికారులు. అయితే హసీనాను చంపిన ఎదుని పట్టుకునే క్రమంలో సత్యభామకి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? సత్యభామ ఈ కేసుని ఎందుకు వ్యక్తిగతంగా తీసుకుంది అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Weekend movie suggestion
Watch queen of masses #KajalAgarwal‘s action packed entertainer #Satyabhama streaming now on #AmazonPrime pic.twitter.com/oXj8XE0wuQ
— TeluguOTTInfo (@TeluguOTTInfo) June 29, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

