Sarvai Papanna | సర్దార్ సర్వాయి పాపన్న డాక్యుమెంటరీకి అంతర్జాతీయ పురస్కారం
సుపద క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సర్వాయి పాపన్న.. ది సోషియో పొలిటికల్ వారియర్ ఆఫ్ దక్కన్ (Sarvai Papanna). ఈ డాక్యుమెంటరీ నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరిలో అవార్డు దక్కించుకుంది.
తెలుగు రాబిన్ హుడ్‌గా పేరుగాంచిన సర్వాయి పాపన్నపై తెరకెక్కించిన డాక్యుమెంటరీ అంతర్జాతీయ స్థాయిలో అవార్డు గెలుచుకుంది. సుపద క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సర్వాయి పాపన్న.. ది సోషియో పొలిటికల్ వారియర్ ఆఫ్ దక్కన్ (Sarvai Papanna – The Socio-Political Warrior of Deccan).
చేతన్ కత్తి దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ నోయిడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ సినిమాటోగ్రఫీ కేటగిరిలో అవార్డు దక్కించుకుంది. 34 నిమిషాల నిడివితో రూపొందించిన ఈ డాక్యుమెంటరీని పొన్నం రవిచంద్ర నిర్మించారు. ఈ ఫెస్టివల్లో 65 డాక్యుమెంటరీలు పోటీకి రాగా.. వీటిలో ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి 17 డాక్యుమెంటరీలు స్క్రీనింగ్‌కు ఎంపికయ్యాయి.
వీటిలో 5 డాక్యుమెంటరీలు భారత్‌కు చెందినవని కాగా.. మిగిలిన డాక్యుమెంటరీలు అమెరికా, చిలీ, జర్మనీ, బెల్జియం, చైనా, స్పెయిన్ దేశాలకు చెందినవి. ఈ దేశాలన్నింటి నుంచి వచ్చిన డాక్యుమెంటరీల్లో తెలంగాణ నుంచి సర్వాయి పాపన్న ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు అందుకోవడం తెలంగాణకు చాలా ప్రత్యేకమైన సందర్భం.
Read Also :
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

