బాహుబలి సినిమాలో కాళకేయ గ్యాంగ్ ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాళకేయ గ్యాంగ్‌లో వేల మంది ఉన్నా కూడా వారిలో ప్రభాకర్ ఒక్కడికే మంచి గుర్తింపు దక్కింది. అయితే ఆ గ్యాంగ్‌లో సారపట్ట పరంబరై ఫేమ్ జాన్ కొక్కెన్ కూడా ఉన్నారనే సంగతి చాలా మందికి తెలియదు. తాజాగా ఆయన తన సోషల్ మీడియాలో కాళకేయ బ్యాచ్‌లో ఉన్నప్పటి ఫొటో షేర్ చేశాడు.
బాహుబలిలో చిన్న పాత్ర చేశాను.ఆ సినిమా షూటింగ్ ఇప్పటికీ గుర్తుంది. ఆ సమయానికి నా పేరు ఎవ్వరికి తెలియదు.అయితే ఏదో ఒక రోజు నా పేరు అందరికి తెలుస్తుందని చెప్పాను. ఆ సమయం ఇప్పటికి వచ్చిందని జాన్ కొక్కెన్ తన ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశాడు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన సారపట్ట చిత్రంలో వెంబులి(వేటపులి) పాత్రలో నటించిన జాన్ కొక్కెన్ శివ దర్శకత్వం వహించిన మరియు అజిత్ నటించిన వీరం చిత్రంతో తమిళ సినిమాలో ఎంట్రీ ఇచ్చాడు.
ఎవడు, వన్ నేనొక్కడినే, వీరుడొక్కడు వంటి తెలుగు చిత్రాలలో నటించిన జాన్ కొక్కెన్.. నటి, బిగ్ బాస్ ఫేం పూజా రామచంద్రన్ భర్త. నటి పూజా రామచంద్రన్ ఎస్ఎస్ మ్యూజిక్ ఛానెల్లో విజేగా పనిచేయడం ద్వారా బాగా ప్రాచుర్యం పొందింది. ఆ సమయంలోనే ఆమె తన సహోద్యోగి విజయ్ ని వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ రెండో పెళ్ళే ఆ తర్వాత అతనితో విడిపోయిన పూజా పూజా కొన్నేళ్ళ క్రితం తెలుగు నటుడు జాన్ కొక్కెన్ తో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.
జాన్ కొకైన్ మొదట నటి మీరా వాసుదేవన్‌ను వివాహం చేసుకున్నాడు. తర్వాత అతను ఆవిడకు విడాకులు ఇచ్చి పూజతో ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు.
The answer…..this is the scene from #bahubali…….a very small role…….I remember the days that I was shooting this….nobody knew my name…..
— Highonkokken (@johnkokken1) August 29, 2021
I would tell myself someday I will make it to the big league and everyone will know my name…..and that day came with #Sarpatta pic.twitter.com/XxwglXslvL