Sarkaru Vaari Paata Trailer In Acharya Theaters | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి రెండేళ్ళు దాటింది. మహేష్ నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీతా గోవిందం’ ఫేం పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మొదటి నుంచి సినిమాపైన ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో చిత్ర బృందం తరచూ ఏదో ఒక అప్డేట్ను ఇస్తుంది. కానీ అభిమానులకు మాత్రం ఆ అప్డేట్స్ సంతృప్తిని ఇవ్వట్లేదు. ఈ క్రమంలో అభిమానులతో పాటు ప్రేక్షకులకు అదిరిపోయే సర్ ప్రైజ్‌ను మేకర్స్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది.
అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న సర్కారు వారి పాట ట్రైలర్ గురించి టాలీవుడ్ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్ర ట్రైలర్ ఏప్రిల్ 29న విడుదల కాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అదే రోజున చిరంజీవి ఆచార్య కూడా విడుదల కానుంది. ఈ క్రమంలో ఆచార్య థియేటర్లలో సర్కారు వారి పాట ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని టాక్. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే మహేష్ ‘ఆచార్య’ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు తెలిసిందే. సర్కారు వారి పాట చిత్రంలో మహేష్‌కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. థమన్ సంగీతం అందించాడు.