Sarkaru Vaari Paata Business | మహేష్ బాబు నుంచి సినిమా వచ్చి దాదాపు రెండున్నరేళ్ళు దాటింది. ఈయన నుంచి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. గీతా గోవిందం ఫేం పరుశురాం ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. బ్యాంకింగ్ స్కామ్‌ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రమోషన్లను జోరుగా జరుపుతుంది. మొదటి నుంచి ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది. ఈ క్రమంలో సర్కారువారి పాట చిత్రానికి భారీ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఏరియా వైజ్ బిజినెస్ ఒకసారి గమనిస్తే
నైజాం : 36 కోట్లు
సీడెడ్ : 13.5 కోట్లు
ఉత్తరాంధ్ర : 13 కోట్లు
ఈస్ట్ : 8.5 కోట్లు
వెస్ట్ : 7.0 కోట్లు
గుంటూరు : 9.0 కోట్లు
కృష్ణ : 7.5 కోట్లు
నెల్లూరు : 4.0 కోట్లు
ఏపి+తెలంగాణ : 98.5 కోట్లు
ఓవర్సీస్ : 11.0 కోట్లు
కర్ణాటక+రెస్ట్ ఆఫ్ ఇండియా : 23.5 కోట్లు
వరల్డ్ వైడ్ థియేట్రికల్ : 125 కోట్లు
సర్కారువారి పాట చిత్రానికి రూ.125కోట్ల థియేట్రికల్ జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలంటే రూ.127కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది. మహేష్ బాబు గతం చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ రూ.100.35 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రానికి రూ.25కోట్లు పెరిగింది. ‘ఎఫ్3’ సినిమా వరకు పెద్ద సినిమాలేవి విడుదల కావడంలేదు. దాంతో సర్కారువారి పాట సినిమాకు రెండు వారాల ఛాన్స్ ఉంది. మరి ఈ గ్యాప్‌ను యూస్ చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూడాలి మరి.