టాలీవుడ్ (Tollywood) స్టార్ యాక్టర్ మహేశ్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం తన అప్ కమింగ్ ప్రాజెక్టు సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. పరశురాం (Parasuram) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మరో రెండు రోజుల్లో అనగా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇపుడు నెట్ఠింట్లో హల్ చల్ చేస్తోంది.
సర్కారు వారి పాటలో మహేశ్ న్యూ లుక్ ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. మహేశ్‌కు ఇతర దక్షిణాది భాషల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా తమిళనాడు, కర్ణాటకలో ఫాలోవర్లు ఎక్కువే అని చెప్పాలి. తమ దగ్గర కూడా సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయాలని..ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ (Subtitles) తో సినిమాను అందించాలని దక్షిణాది రాష్ట్రాలకు చెందిన అభిమానుల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయట.
ఇటీవల కాలంలో చాలా మంది ప్రేక్షకులు సినిమా ఒరిజినల్ వెర్షన్‌ను వీక్షించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండటంతో, తెలుగు వెర్షన్‌ను సబ్ టైటిల్స్ తో విడుదల చేయాలని మేకర్స్ డిసైడ్ అయినట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. మొత్తానికి ఇతర భాషా చిత్రాలలాగే తెలుగు వెర్షన్ ను ఇతర దక్షిణాది ప్రేక్షకలకు పరిచయం చేసేందుకు రెడీ అవడం మంచి విషయమంటున్నారు సినీ విశ్లేషకులు.
Read Also : Shraddha Das | ‘చిట్టి నడుమునే చూస్తున్నా..చిత్రహింసలో చస్తున్నా’
Read Also : #Whatshappening | మహేశ్ ట్విటర్లో ఎవరిని ఫాలో అవ్వాలనుకుంటున్నాడంటే..వీడియో వైరల్