శనివారమే ముహూర్తం
‘దసరా’ ‘హాయ్ నాన్న’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు హీరో నాని. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’లో నటిస్తున్నారు.
‘దసరా’ ‘హాయ్ నాన్న’ చిత్రాలతో వరుస విజయాలను సొంతం చేసుకున్నారు హీరో నాని. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’లో నటిస్తున్నారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. మంగళవారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్త పోస్టర్ను విడుదల చేశారు.
ఇందులో నాని, సాయికుమార్ సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ‘వినూత్నమైన కాన్సెప్ట్ ఇది. కోపాన్ని క్రమపద్ధతిలో వాడుకుంటూ శనివారాలను మాత్రమే ముహూర్తాలుగా పెట్టుకొని శత్రువులను వేటాడే వ్యక్తిగా నాని పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ఆగస్ట్ 29న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నాం’ అని చిత్ర బృందం పేర్కొంది. ప్రియాంక అరుళ్ మోహన్, ఎస్.జే.సూర్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మురళి.జి, సంగీతం: జేక్స్ బిజోయ్, రచన-దర్శకత్వం: వివేక్ ఆత్రేయ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కృష్ణసాగర్లో జన జాతీయ గౌరవ దీవస్ పక్షోత్సవాలు
RS Praveenkumar | శేరిలింగంపల్లిలో ప్రభుత్వ భూమి కబ్జా.. సాక్ష్యాధారాలతో బయటపెట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
అన్నదాతపై అశనిపాతం.. కన్నీరు పెట్టిస్తున్న ‘మురసు’
Beauty tips | మీ చర్మాన్ని యవ్వనంగా మార్చే బొటాక్స్ ట్రీట్మెంట్ గురించి తెలుసా..?
Ambati Rambabu | రాజకీయ కుట్రతోనే ఈడీ నోటీసులు : మాజీ మంత్రి అంబటి రాంబాబు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

