‘ఒకప్పుడు థియేటర్‌కు వెళ్లగానే సినిమా ప్రపంచంలోకి వెళ్లిన ఫీలింగ్. ఇప్పుడు ఓటీటీ రూపంలో మన ప్రపంచంలోకి సినిమా వచ్చి చేరింది. థియేటర్లో ప్రేక్షకుడు తన దృష్టిని సెల్‌ఫోన్‌పై పోనీయకుండా ఏం చేయాలన్నదే ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ ముందున్న అతిపెద్ద సవాలు’ అన్నారు ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.
ఆయన నిర్ధేశకత్వంలో ప్రియదర్శి కథానాయకుడిగా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా శనివారం ఇంద్రగంటి మోహనకృష్ణ పాత్రికేయులతో ముచ్చటిస్తూ పంచుకున్న విశేషాలు..