Double Ismart Movie | అంత నెగెటీవ్ టాక్ వచ్చిన స్కంద బాక్సాఫీస్ దగ్గర బాగానే నెట్టుకొస్తుంది. పోటీగా ఎలాంటి సినిమాలు లేకపోవడం స్కందకు బాగానే కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో స్కంద ఇప్పటికీ డీసెంట్ కలెక్షన్లు రాబడుతుంది. ఇక రామ్ పోతినేని ప్రస్తుతం పూరితో కలిసి డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ కూడా పూర్తయిపోయాయి. ఈ సారి మరింత బిగ్ స్కేల్లో పాన్ ఇండియా సినిమాగా డబుల్ ఇస్మార్ట్‌ను రూపొందిస్తున్నారు. ఇక షూటింగ్ మొదలై ఇన్ని నెలలు గడుస్తున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా ఎవరు నటిస్తున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
మేకర్స్ సైతం దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా తాజాగా ఈ సినిమాలో రామ్ పక్కన నటించేందుకు బాలీవుడ్ హీరోయిన్ను రంగంలో దింపేందుకు మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరా అనుకంటున్నారా? తనెవరో కాదు సైఫ్ అలీఖాన్ పెద్ద కుమార్తె సారా అలీఖాన్. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో రామ్ పక్కన సారానే ఎంపిక చేయాలని మేకర్స్ ప్రయత్నాలు జరుపుతున్నారట. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఇదే నిజమైతే సారాకు తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది.
మూడు నెలల కిందట ప్రారంభమైన డబుల్ ఇస్మార్ట్ చక చక షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయిందని ఇన్సైడ్ టాక్. బిగ్ బుల్గా సంజయ్ దత్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ చివరి దశకు వచ్చేసిందట. లైగర్ వంటి అల్ట్రా డిజాస్టర్ తర్వాత కాస్త సైలెంట్ అయిన పూరి.. ఈ సినిమాతో ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని కసితో ఉన్నాడు. మణిశర్మ ఈ సినిమాకు స్వరాలు అందించబోతున్నట్లు సమాచారం.