Venkatesh | సంక్రాంతి బరిలోకి దిగాం.. బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాం: వెంకటేష్
‘నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. థియేటర్లో వారి నవ్వులు చూడటం గొప్ప అనుభూతినిస్తున్నది. ఈ సంక్రాంతికి మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేశారు. నా కెరీర్లో మరో అద్భుత విజయమిది’ అన్నారు అగ్ర నటుడు వెంకటేష్.
Venkatesh | ‘నేను ఫ్యామిలీ సినిమా చేసిన ప్రతిసారి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. థియేటర్లో వారి నవ్వులు చూడటం గొప్ప అనుభూతినిస్తున్నది. ఈ సంక్రాంతికి మా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ చేశారు. నా కెరీర్లో మరో అద్భుత విజయమిది’ అన్నారు అగ్ర నటుడు వెంకటేష్. ఆయన కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా మంగళవారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ ‘సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను ఇవ్వాలనే సంకల్పంతోనే బరిలోకి దిగాం. విడుదలైన ప్రతి కేంద్రంలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. దిల్ రాజు, శిరీష్ కెరీర్లో కూడా ఇదొక భారీ విజయంగా నిలవడం ఆనందంగా ఉంది’ అన్నారు.
అమెరికా నుంచి అమలాపురం వరకు షోలు పూర్తి కాగానే బ్లాక్‌బస్టర్ సంక్రాంతి హిట్ అనే రిపోర్ట్స్ వచ్చాయని, ప్రేక్షకులు నాన్‌స్టాప్‌గా ఎంజాయ్ చేస్తున్నారని, థియేటర్లోనే ఈ సినిమాను చూసి ఆస్వాదించాలని నిర్మాత దిల్ రాజు చెప్పారు. ఉదయం నాలుగున్నర షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ రావడం చాలా ఆనందంగా ఉందని, భారీ ఓపెనింగ్స్ లభించాయని, ఇట్స్ ఏ బ్లాక్‌బస్టర్ పొంగల్ హిట్ అని దర్శకుడు అనిల్ రావిపూడి ఆనందం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత శిరీష్, కథానాయికలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్యరాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

