Prabhas Movie | ఆరు నెలలు ప్రభాస్‌ను దాచేస్తున్న సందీప్ వంగా? ‘స్పిరిట్’ లుక్ కోసమేనా!
Prabhas Spirit | ప్రభాస్ మరియు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రానున్న మోస్ట్-అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'స్పిరిట్' గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది.
Prabhas Spirit | ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రానున్న మోస్ట్-అవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘స్పిరిట్’ గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవల మొదలవ్వగా, దర్శకుడు సందీప్ వంగా ప్రభాస్ లుక్ విషయంలో అత్యంత గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ‘స్పిరిట్’ సినిమాలోని ప్రభాస్ పాత్ర లుక్‌ను అభిమానులకు సర్ప్రైజ్గా ఉంచాలని సందీప్ వంగా గట్టిగా నిర్ణయించుకున్నారు. అందుకే, ఈ లుక్ లీక్ అవ్వకుండా ఉండేందుకు, రాబోయే ఆరు నెలల పాటు ప్రభాస్‌ని పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉండాలని ఆయన కోరినట్లు సమాచారం.
పబ్లిక్ ఈవెంట్లు, ఎయిర్‌పోర్ట్‌లలో ప్రభాస్ కనిపిస్తే, ఆయన లుక్‌ను అభిమానులు లేదా మీడియా ఫొటోలు తీసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, కొన్ని నెలల పాటు ఎలాంటి ప్రచార కార్యకలాపాలు లేదా బహిరంగ కార్యక్రమాలకు హాజరు కాకూడదని ప్రభాస్, సందీప్ వంగా నిర్ణయించుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నిర్ణయం ప్రభాస్ అభిమానులను కొంత నిరాశపరిచినా సందీప్ వంగా ప్రభాస్‌ను ఏ విధంగా ప్రెజెంట్ చేయబోతున్నారో చూడాలనే ఉత్సాహం మాత్రం వారిలో ఎక్కువగా ఉంది. ‘స్పిరిట్’ చిత్రంలో త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్, కాంచన ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

