Samuthirakani | ఇండస్ట్రీలో రాజకీయ వేత్తల బయోపిక్స్ (Biopic)కొత్తేమీ కాదని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రజాసేవకు పునరంకితమైన పొలిటికల్ లీడర్ల జీవితాలపై సినిమా వస్తుందంటే క్రేజ్ కూడా మామూలుగా ఉండదు. తాజాగా ఓ పాపులర్ పొలిటిషియన్ బయోపిక్ వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ లీడర్ ఎవరనేది సస్పెన్స్ నెలకొనగా.. ఈ బయోపిక్‌లో తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ కమ్ డైరెక్టర్ సముద్రఖని (Samuthirakani) టైటిల్ రోల్లో కనిపించబోతున్నాడని జోరుగా టాక్ నడుస్తోంది.
ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నట్టు సమాచారం. తన నియోజకవర్గంలో నిజాయితీగా పనిచేస్తూ.. ప్రజల మన్ననలు పొంది.. పీపుల్స్ పర్సన్‌గా పేరొందిన రాజకీయవేత్త బయోపిక్‌గా రాబోతుండగా.. ఇంతకీ ఎవరా వ్యక్తి అనేది ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్‌గా వ్యవహరించబోతున్నాడట.
ఒకవేళ ఇదే నిజమైతే యాక్టర్‌గా సముద్రఖనిలోని అన్ని షేడ్స్‌ను పూర్తి స్థాయిలో చూసే అవకాశముంటుందని అప్పుడే తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు.
ఈ ఏడాది దసరా, నేను స్టూడెంట్ సార్, విమానం సినిమాల్లో మెరిశాడు సముద్రఖని. మరోవైపు పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ కాంబోలో బ్రో సినిమా కూడా తెరకెక్కించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం రెండు పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. వీటిలో ఒకటి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 కాగా.. మరొకటి రాంచరణ్, శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్. ఈ రెండు భారీ చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి.