Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Film Controversy | మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'సంబరాల ఏటి గట్టు' (Sambarala Yeti Gattu) విడుదల తేదీ వ్యవహారం టాలీవుడ్లో తీవ్ర సంచలనంగా మారింది.
Sambarala Yeti Gattu | మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yeti Gattu) విడుదల తేదీ వ్యవహారం టాలీవుడ్లో తీవ్ర సంచలనంగా మారింది. బ్లాక్‌బస్టర్ హిట్ ‘హనుమాన్’ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామాను 2027 సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే ప్రకటించింది. అయితే ఈ విడుదల తేదీపై అప్పుడే వివాదాలు తలెత్తడం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
సంక్రాంతి బరిలో సినిమాను దింపుతామని ప్రకటించినప్పటి నుంచి తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని నిర్మాత చైతన్య రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంక్రాంతి సీజన్ కాకుండా వేరే తేదీ కనిపించలేదా అంటూ కొందరు ఫోన్ చేసి తమను నిలదీశారని, అంతేకాకుండా ఆ తేదీకి సినిమా ఎలా విడుదల చేస్తారో చూస్తామంటూ పరోక్షంగా హెచ్చరికలు, ఒత్తిళ్లకు పాల్పడ్డారని ఆయన వెల్లడించారు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఇలాంటి పెద్ద సినిమాల మధ్య పోటీ సహజమే అయినప్పటికీ, విడుదల తేదీల విషయంలో తెరవెనుక జరుగుతున్న ఈ రకమైన ఒత్తిళ్లు మరియు బెదిరింపులు ఇండస్ట్రీలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, అన్ని సవాళ్లను ఎదుర్కొని అనుకున్న తేదీకే తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మేకర్స్ గట్టి పట్టుదలతో ఉన్నారు. మరి ఈ వివాదం ముందెలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
IMAX IN Hyderabad | సినిమా లవర్స్‌కు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో మరో సరికొత్త ఐమ్యాక్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

