Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాల కన్నా కూడా ఇతర విషయాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ వస్తుంది. మయోసైటిస్ వలన సినిమాలు కాస్త తగ్గించిన సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. తన పర్సనల్, ప్రొఫెషనల్ కి సంబంధించిన పలు విషయాలు పంచుకుంటూ ఉంటుంది. అలానే ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా కోలీవుడ్లో జరిగిన గోల్డెన్ క్వీన్ అవార్డుల కార్యక్రమంలో ప్రముఖ నటి సమంత గోల్డెన్ క్వీన్ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె తన సినీ ప్రయాణం, వ్యక్తిగత అనుభవాల గురించి మాట్లాడింది. అలానే దర్శకుడు,నటుడు రాహుల్ రవీంద్రన్తో తనకి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూ, ఆయన తనకు అండగా నిలిచిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. తనకు ఆరోగ్యం బాగాలేని క్లిష్ట సమయంలో రాహుల్ రవీంద్రన్ అండగా నిలిచాడని సమంత చెప్పుకొచ్చింది. లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు రాహుల్ నాతోనే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నాడు. మా బంధానికి పేరు పెట్టలేను. స్నేహితుడా, సోదరుడా, కుటుంబ సభ్యుడా అనేది చెప్పలేను అంటూ రాహుల్పై తనకున్న అభిమానాన్ని వ్యక్తపరిచింది సమంత.
ఇక అభిమానుల సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని, అది నా అదృష్టం, హార్ట్ వర్క్, లక్ వల్లనే ఇది సాధ్యమైందని పేర్కొంది. ఇక మనం తీసుకునే ఒక్క నిర్ణయాన్ని బట్టి కెరీర్ ఎలా ఉంటుందో చెప్పలేం. తెలిసీ, తెలియక తీసుకునే ఎన్నో నిర్ణయాలు మన ప్రయాణంపై ప్రభావం చూపుతాయి అని సమంత పేర్కొంది. ఇక దర్శకురాలు సుధ కొంగర.. సమంతపై ప్రశంసలు కురిపించింది సమంత. గత ఐదేళ్లుగా ఆమెను దగ్గర నుంచి చూస్తున్నానని,ఆమె కష్టాలు చూసి కన్నీళ్లు వచ్చేవని, ఎంతోమంది అమ్మాయిలకు సమంత స్ఫూర్తి అని అన్నారు ఆమె నటించిన ‘ఊ అంటావా..’ పాట నాకెంతో ఇష్టం” అని సుధ కొంగర చెప్పుకొచ్చారు. ఇక అదే సమయంలో నాకు యాక్షన్ ఫిల్మ్ చేయాలనే ఆసక్తి ఉందని అనడంతో, తప్పకుండా మనం ఒక యాక్షన్ ఫిల్మ్ చేద్దాం అంటూ సుధ కొంగర హామీ ఇచ్చారు