అక్కినేని కోడలు సమంతకు తెలుగు రాష్ట్రాలలోనే కాదు పక్క రాష్ట్రాలలోను ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో సమంత దేశ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. సమంత ఫ్యాన్ ఫాలోయింగ్‌ని గుర్తించిన పలు కంపెనీలు ఆమెను తమ బ్రాండ్లకు ప్రచారం చేయాల్సిందిగా పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో సమంత రెండు చేతులా బాగా సంపాదిస్తుంది.
సమంత ఒకవైపు సినిమాలు చేస్తూనే మరో వైపు వాణిజ్య ప్రకటనలలో నటిస్తుంది. ఇంకోవైపు సోషల్ మీడియా ద్వారా కూడా బ్రాండ్స్‌ని ప్రచారం చేస్తుంటుంది. అలానే తాను మొదలు పెట్టిన బిజినెస్ కార్యక్రమాలు కూడా చూసుకుంటూ ఉంటుంది. అయితే ఈ అమ్మడు ఒక్క ఇన్స్టాగ్రామ్ ద్వారానే 25 నుండి 30 లక్షల వరకు తీసుకుంటోందని సమాచారం. సోషల్ మీడియాలో 18 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న సమంత ఆ పాపులారిటీతో బాగానే సంపాదిస్తుంది.
ఒకవైపు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఫోటోలను షేర్ చేసే సమంత మరోవైపు కమర్షియల్ పోస్టును కూడా షేర్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తోంది. ప్రస్తుతం సమంత శాకుంతలం చిత్రంతో బిజీగా ఉండగా, ఈ సినిమాలో శకుంతల పాత్ర పోషించింది. తాజాగా ఈ అమ్మడి షూటింగ్ పూర్తైంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది సమంత. మొత్తానికి గుడ్ బై చెప్పే సమయం వచ్చింది. గుణ శేఖర్ సర్ మీద నాకు అంతులేని ప్రేమాభిమానాలు, గౌరవం ఏర్పడ్డాయి. నా ఊహకందని ప్రపంచాన్ని ఆయన నిర్మించేశారు. ఇప్పుడు నాలో ఉన్న ఆ పసితనం, ఆ చిన్నపిల్ల ఎంతో సంబరంతో డ్యాన్సులు వేస్తోంది. థ్యాంక్యూ సర్ అని సమంత ఎమోషనల్ అయ్యారు.