Samantha | హీరో హీరోయిన్ మధ్య పారితోషికాల్లో ఎందుకంత వ్యత్యాసం..? : సమంత
Samantha | ‘ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత (Samantha).
Samantha | ‘ఏమాయ చేశావే’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మాయ చేసింది సమంత (Samantha). ఆ తర్వాత వరుస సినిమాలతో అనతికాలంలోనే అగ్ర కథానాయికగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది. అయితే, నాగచైతన్యతో విడాకులు, మయోసైటిస్ కారణంగా కాస్త సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సామ్.. ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది.
టాలీవుడ్లో సమంత సినిమా వచ్చి రెండేళ్లవుతోంది. చివరిసారిగా విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ చిత్రంతో పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ అనే మూవీ చేస్తోంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో ‘రక్త్ బ్రహ్మాండ్’ (Rakt Brahmand) అనే ప్రాజెక్ట్‌లోనూ భాగమైంది. ఇవి కాకుండా ‘శుభం’ అనే సినిమా నిర్మిస్తోంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన సామ్.. హీరో హీరోయిన్ల మధ్య పారితోషికం వ్యత్యాసంపై పెదవి విప్పింది. ఈ విషయంలో హీరోయిన్స్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు చెప్పింది. హీరోలు, హీరోయిన్లు ఒకేలా కష్టపడుతున్నప్పటికీ పారితోషికాల్లో మాత్రం ఎందుకు ఇంత వ్యత్యాసం..? అని ప్రశ్నించింది.
‘నేను చాలా సినిమాల్లో నటించాను. హీరోలతో సమానంగా వర్క్ చేశాను. కానీ, మాకిచ్చే రెమ్యునరేషన్ మాత్రం ఒకేలా ఉండేది కాదు. కొన్ని పెద్ద సినిమాల్లో హీరో పాత్ర కీలకంగా ఉంటుంది. పైగా తనే జనాల్ని థియేటర్‌కు రప్పించగలడు. అలాంటి వాటిని నేను అర్థం చేసుకోగలను. అలాంటి సినిమాల్లో ఇద్దరి మధ్య బేధం చూపించినా నేను తప్పుపట్టను. కానీ, కొన్ని చిత్రాల్లో హీరో హీరోయిన్‌కు ఇద్దరికీ సమాన ప్రాధాన్యత ఉంటుంది. పారితోషికం దగ్గర మాత్రం వ్యత్యాసం చూపిస్తారు. అలా ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. నేను ఇండస్ట్రీలో 15 సంవత్సరాలుగా ఉన్నాను. పరిశ్రమలో నన్ను ఇబ్బందిపెట్టే విషయాల్లో ఇదీ ఒకటి. అందుకే ఇన్నేళ్లలో నేను చేసిన తప్పుల్ని పునరావృతం కాకుండా చూసుకుంటాను. ఈ విషయంలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నా. సడన్‌గా అన్నీ మార్చలేనేమో కానీ భవిష్యత్తు గురించి మాత్రం ఏదో ఒకటి చేయగలను. మార్పు నాతోనే మొదలవ్వాలని అనుకుంటున్నా. అందుకే నా సంస్థలో ఇలాంటి వ్యత్యాసం రాకుండా చూసుకుంటున్నాను’ అని సమంత చెప్పుకొచ్చింది.
Also Read..
Samantha | అప్పుడు ప్రౌడ్‌గా ఫీలయ్యేదాన్ని.. ఇప్పుడు బేషరతుగా క్షమాపణ చెబుతున్నా: సమంత
Salman Khan | ఇంట్లోనే చంపుతాం.. సల్మాన్‌కు మరోసారి హత్య బెదిరింపులు
Tamannaah Bhatia | పెళ్లెప్పుడు చేసుకుంటావని అడిగిన యాంకర్.. స్టన్నింగ్ రిప్లై ఇచ్చిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders Attack | ఫేస్బుక్ మెటా ఆఫీస్ పై కాంగ్రెస్ నాయకుల దాడి
Hyderabad | నీటి ట్యాంకు నుంచి వృథాగా పోతున్న తాగునీరు..
Enugula Rakesh Reddy | యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను మోసం చేసిన కాంగ్రెస్ : ఏనుగుల రాకేష్‌రెడ్డి
Road Accident | ఆటో బోల్తా..ఐదుగురికి గాయాలు
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్ నాయకుడు లేఖ
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

