Samantha | దక్షిణాది లీడింగ్ హీరోయిన్లలో వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ లో ఉంటుంది సమంత (Samantha). తెలుగులో రాంచరణ్, ప్రభాస్, ఎన్టీఆర్‌తోపాటు కోలీవుడ్ స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక రీసెంట్గా సమంత (Samantha), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) నటించిన ఖుషి (Kushi) మూవీ సెప్టెంబర్ 01న విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో సామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక వరుణ్ ధావన్తోనూ సామ్ ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. ‘సిటాడెల్’ అనే హాలీవుడ్ యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్‌కు ఇది ఇండియన్ వెర్షన్. ఫ్యామిలీ మ్యాన్ వంటి భారీ హిట్ తర్వాత సామ్ తన రెండో వెబ్ సిరీస్ చేస్తుంది. ఇదిలా ఉంటే సామ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం.. సామ్.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుందట. అది ఎవరి పక్కనో కాదు ఏకంగా కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman khan) పక్కన నటించనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు విష్ణువర్ధన్ (Vishnu Vardhan) దర్శకత్వం వహించబోతుండగా.. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ నిర్మించనున్నాడు. ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్‌తో పాటు ‘పుష్ప: ఊ అంటావా’ సాంగ్‌తో నార్త్ ఆడియెన్స్‌ను ఓ ఊపు ఊపేసిన సమంతకు ఈ మూవీ ఛాన్స్ మరింత పేరు తెచ్చిపెట్టే అవకాశం ఉందని బీ టౌన్ టాక్. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.