Samantha | సామ్ షాకింగ్ నిర్ణయం.. సినిమాలకు లాంగ్ బ్రేక్..!
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుందట.
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గతేడాది మయోసైటిస్ అనే అరుదైన (myositis diagnosis) వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపి అందరిని షాక్కు గురిచేసిన విషయం తెలిసిందే. ఎవరి సాయం లేకున్నా ఒంటిరిగా పోరాడుతూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలోనూ తను సక్సెస్ అని నిరూపించుకుంటోంది. ఈ వ్యాధి కారణంగా గతకొన్ని నెలలుగా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చిన సమంత.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతోంది. ఇప్పటికే సగంలో ఆగిన ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి సామ్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుందట.
సామ్ ప్రస్తుతం వరుణ్ ధావన్ తో కలిసి ‘సిటాడెల్’(Citadel), టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ’ ( Kushi) చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుణ్ తో కలిసి సిటాడెల్ షూటింగ్ సెర్బియాలో కంప్లీట్ చేసింది. మరో రెండు మూడు రోజుల్లో ఖుషీ షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి కానుంది. ఆ తర్వాత సామ్ తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. ఇందులో భాగంగానే ఒక ఏడాది పాటు సినిమాలకు లాంగ్ బ్రేక్ (break from acting) ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఖుషీ, సిటాడెల్ తర్వాత సామ్ కు బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ సహా మరే ఇతర భాషలో కొత్త చిత్రాల్లో నటించేందుకు సైన్ చేసే ఆలోచన లేదట. వాస్తవానికి ఖుషీ సినిమా తర్వాత తాను పని చేయాలనుకుంటున్న ప్రాజెక్టుల కోసం ముందుగా తీసుకున్న అడ్వాన్స్ ను కూడా నిర్మాతలకు తిరిగి ఇచ్చేసిందని సమాచారం.
గత కొన్నిరోజులుగా సమంత మయోసైటిస్ అనే ఆటోఇమ్మూనిటీ డిసీజ్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ‘యశోద’ చిత్రం తర్వాత మయోసైటిస్ కారణంగా కాస్త బ్రేక్ తీసుకుంది కూడా. ఆ తర్వాత శాకుంతలం పూర్తి చేసింది. అయితే ఆ డిసీజ్ నుంచి సామ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో తన ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోంది. ఇందులో భాగంగానే యాక్టింగ్ కు ఓ ఏడాది బ్రేక్ తీసుకుని తన ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టాలని నిర్ణయించుకుందట. దాన్నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతురాలు కావాలని అనుకుంటోందట. ఆ తర్వాతే సినిమాల్లోకి రావాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.
Also Read..
Tomato Price | రికార్డు స్థాయికి టమాట ధర.. కిలో రూ.155.. ఎక్కడంటే?
Unemployment | కరోనా సంక్షోభం.. దేశంలో తారాస్థాయికి నిరుద్యోగిత రేటు: సీఎంఐఈ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

