Samantha | లక్ష్యాన్ని ముద్దాడేదాకా వెనకడుగేయను: సమంత
నా పదిహేనేళ్ల ప్రయాణం ఓ పాఠం.. ఆ పాఠం నుంచి పోరాటం నేర్చుకున్నా.’ అంటున్నారు అగ్ర నటి సమంత. తన కెరీర్ పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, గడచిన కాలం గురించీ, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాల గురించి సోషల్ మీడియాలో స్పందించారు సమంత.
Samantha | ‘నా పదిహేనేళ్ల ప్రయాణం ఓ పాఠం.. ఆ పాఠం నుంచి పోరాటం నేర్చుకున్నా.’ అంటున్నారు అగ్ర నటి సమంత. తన కెరీర్ పదిహేనేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, గడచిన కాలం గురించీ, భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాల గురించి సోషల్ మీడియాలో స్పందించారు సమంత. ‘అపజయాలు ఎదురైనప్పుడు కెరీర్‌ను సవాలుగా తీసుకోవడం మామూలే. కానీ నేను విజయాలను సవాలుగా తీసుకుంటా. ఓ విజయం దక్కితే.. దాన్ని మించిన విజయం కోసం శ్రమిస్తా. అదే నా సక్సెస్ వెనుక ఉన్న రహస్యం’ అని తెలిపారు సమంత.
‘ఇక నుంచి కొత్త సమంతను చూస్తారు. నా ప్రయాణంలో అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడే దాకా వెనుకంజ వేయను. నా ప్రయాణం భావితరాలకు పాఠం కావాలి. ఓ స్త్రీగా నాకంటూ చరిత్రలో కొన్ని పేజీలుండాలి.. అదే నా లక్ష్యం. దానికోసం ఇకనుంచి నా పోరాటం నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది.’ అంటూ పేర్కొన్నారు సమంత. మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూసినవారంతా.. సమంతలో ఓ పొలిటికల్ లీడర్ని చూస్తున్నారు. భవిష్యత్‌లో పాలిటిక్స్‌లోకి వెళ్తుందేమో.. అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు. కొందరైతే ‘తలైవీ..’ అంటూ ఏకంగా జయలలితతో పోల్చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

