samantha naga chaitanya divorce | విడిపోయినప్పటికీ ఆ విషయంలో మాత్రం చైతూ, సమంత మాట ఒక్కటే..

samantha naga chaitanya divorce | దాదాపు పదేళ్ల స్నేహ బంధానికి.. నాలుగేళ్ల వివాహ బంధానికి విడాకులతో ముగింపు పలికారు నాగ చైతన్య సమంత. ఇకపై ఈమె మాజీ అక్కినేని కోడలు అనే విషయాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ తో అంత బాగా కలిసిపోయింది సమంత. అలాంటి హీరోయిన్ ఇప్పుడు ఆ కుటుంబం నుంచి బయటకు వెళ్లిపోయిందని తెలిసిన తర్వాత ఫాన్స్ బాగా ఫీల్ అవుతున్నారు. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీ గురించి తెగ సర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే గతంలో నాగార్జున కూడా విడాకులు తీసుకున్నాడు. అలాగే ఆయన మేనల్లుడు సుమంత్ కూడా హీరోయిన్ కీర్తి రెడ్డికి పెళ్లయిన రెండు సంవత్సరాల్లోనే విడాకులు ఇచ్చాడు. అఖిల్ కూడా నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు.
ఇప్పుడు నాగచైతన్య, సమంత కూడా నాలుగు సంవత్సరాల పెళ్లి బంధానికి ముగింపు పలికారు. అయితే ఒక విషయంలో మాత్రం ఈ జంట ఒకే మాట మీద ఉన్నారు. అధికారికంగా తాము విడిపోతున్నట్లు సమంత ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ తర్వాత నాగ చైతన్య కూడా అభిమానులకు ఈ విషయం అధికారికంగా చెప్పాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సోషల్ మీడియాలో తమ విడాకుల గురించి ఇద్దరు పోస్ట్ చేసింది ఒక్కటే లెటర్. తమ మధ్య అభిప్రాయ భేదాల కారణంగా విడిపోతున్నాం అని ఇద్దరూ ఒకటే లెటర్ పోస్ట్ చేశారు. ఇది చూసి అభిమానులు షాక్ అయ్యారు. పోనీలే మిగిలిన విషయాల్లో అభిప్రాయ బేధాలు ఉన్న.. లెటర్ విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే అభిప్రాయంతో అభిమానులకు తమ అభిప్రాయాలు తెలిపారు అంటున్నారు నెటిజన్లు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
samantha naga chaitanya divorce | మేం విడిపోతున్నం.. విడాకులపై క్లారిటీ ఇచ్చిన నాగచైతన్య, సమంత
chai sam divorce | నాగ చైతన్య, సమంత విడాకులు.. కారణాలు ఇవేనా..?
Naga chaitanya samantha divorce | సమంతకు చైతూ భరణంగా అన్ని కోట్లు ఇస్తున్నారా..?
భారీగా భరణం ఇచ్చి విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీళ్లే
Samantha | హ్యాపీ మూడ్లో సమంత..ఈ స్పెషల్ వీడియో చూడండి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

