Maa Inti Bangaram | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ టాక్‌తో రన్ అవుతోంది. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా పిక్చర్స్ (Tralala Pictures) నిర్మించిన విషయం తెలిసిందే. యాక్షన్ డ్రామా నేపథ్యంలో ఫేమేల్ ఓరియెంటెడ్ సినిమాగా వచ్చిన మా ఇంటి బంగారం కాసుల వర్షం కురిపిస్తోంది. 24వ రోజులోకి ఎంట్రీ ఇచ్చింది.
మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటరైంది. ఈ ఫీట్ సాధించిన టాలీవుడ్ ఫీ మేల్ సెంట్రిక్ సినిమాగా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. సమంత భర్త, డైరెక్టర్ రాజ్ నిడిమోర్ ఈ చిత్రానికి కథనందించగా.. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. థ్రియాట్రికల్ రన్లో ఏ మాత్రం తగ్గేదేలే అంటూ తన జోరు కొనసాగిస్తోంది. మరి రాబోయే రోజుల్లో మా ఇంటి బంగారం ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో చూడాలి.
ఓ వైపు గృహిణిగా, మరోవైపు వీరవనితలాగే ఉగ్రరూపం చూపిస్తూ సాగే ఈ సినిమాలో సామ్‌ను సరికొత్తగా కనిపిస్తూ అభిమానులు, మూవీ లవర్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది. పెళ్లి అయిన అనంతరం పల్లెటూరికి కోడలిగా వెళ్లిన సమంతకి అక్కడ ఎదురైన సంఘటనలు ఏంటి.. తన గతం ఏంటి అనే నేపథ్యంలో సాగే ఈ సినిమాపై మీరూ ఓ లుక్కేయండి మరి.
Official: #MaaIntiBangaram
History Made! The First Ever Female -Led Telugu Film to Smah the 100 Crore Club! 🔥
Samantha process why she’s the Real Lady Superstar 👑@Samanthaprabhu2 #LadySuperstar #Samantha #100CroreClub pic.twitter.com/LbdSyPtVyV
— Suma Shree (@thesumashree) July 12, 2026