Samantha Gets Emotional | ‘శాకుంతలం’ ట్రైలర్ ఈవెంట్లో సమంత కంటతడి పెట్టింది. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న మహిళా ప్రధాన చిత్రం ‘శాకుంతలం’. గుణ శేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. కాగా ట్రైలర్ ఈవెంట్లో సమంత భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ మూవీ దర్శకుడు గుణశేఖర్ మాట్లాడుతుండగా సమంత ఎమోషనల్ అయింది.
ట్రైలర్ ఈవెంట్లో గుణ శేఖర్ ఈ సినిమాకు నిజమైన హీరో సమంత అని ప్రశసించాడు. దాంతో సామ్ ఎమోషనల్‌కు గురై కన్నీళ్లు పెట్టుకుంది. అనంతరం సమంత మాట్లాడుతూ ‘ఈ సినిమా చూశాక నాపై మరింత అభిమానం పెరుగుతుంది. ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకుని ఈవెంట్‌కు వచ్చానని’ తెలిపింది. ఇక ఇటీవలే సామ్ మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. కాగా ఇప్పడిప్పుడే సామ్ కోలుకుంటుంది.
మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను గుణ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించింది. దిల్‌రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రుద్రమదేవి తర్వాత గుణశేఖర్ ఈ సినిమా కోసం దాదాపు ఏడేళ్ళ సమయం తీసుకున్నాడు.