Samantha| ఏ మాయ చేశావే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సమంత సినీ పరిశ్రమలో 15 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకుంది. ఈ జర్నీలో సమంత ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసింది. సినిమాలు, పర్సనల్ లైఫ్‌లో సమంత కొన్ని కష్టాలు పడింది. నాగ చైతన్యని ఎంతో ఘాడంగా ప్రేమించి అతనికి విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత మయోసైటిస్ బారిన పడి సంవత్సరం పాటు సినిమాలకి కూడా దూరమైంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలపై ఫోకస్ పెడుతుంది. అలానే డేటింగ్ వార్తలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. సమంత రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో పాటు, సిటాడెల్ అనే సిరీస్ లో నటించగా ఈ వెబ్ సిరీస్‌లలో ఒకరైన రాజ్ నిడమూరుతో సమంత క్లోజ్ గా ఉందనే రూమర్స్ కొంత కాలంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి.
ఇటీవల పిక్ బాల్ లీగ్ మ్యాచ్ చూసేందుకు రాజ్, సమంత కలసి జంటగా వచ్చారు. ఆ సమయంలో సమంత రాజ్ తో చాలా సన్నిహితంగా ఉన్నట్లు ఈ ఫొటోస్ చూసిన వారికి అర్ధం అవుతుంది. ఇంకేముంది వారు ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు కాబట్టే అంత క్లోజ్ గా ఉంటున్నారు అని నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇక తాజాగా సమంత మరోసారి రాజ్‌తో తళుక్కున మెరిసింది.. ఫ్యాషన్ డిజైనర్ క్రిషా బజాజ్ పుట్టిన రోజు వేడుకల్లో సమంత, రాజ్ నిడిమోరు జంటగా కనిపించారు. ఇక్కడ వారిద్దరు చాలా క్లోజ్‌గా.. ఒకరినొకరు విడదీయనట్టుగా కనిపించడంతో మళ్లీ రూమర్స్ మొదలయ్యాయి.
నెల రోజుల్లోనే వారిద్దరు జంటగా ఇలా కనిపించడంతో అందరు అనేక ఆలోచనలు చేస్తున్నారు. అయితే ఈ విషయంలో కొందరు సమంతని ట్రోల్ చేస్తున్నారు. అందుకు కారణం రాజ్‌కి పెళ్లయి ఉండడమే. రాజ్ కుటుంబంతో నివసిస్తున్నారని, అతనితో ఉన్న ఫోటోను ఇలా షేర్ చేయడమేంటని కామెంట్ చేస్తున్నారు. అయితే రాజ్‌కి పెళ్లయిన ఆయన తన భార్యకి విడాకులు ఇచ్చి సమంతని వివాహం చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై పూర్తి క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.