Citadel: Honey Bunny | టాలీవుడ్ నటి సమంత చాలా రోజుల తర్వాత వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny). ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఈ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం.
అయితే ఈ చిత్రానికి సంబంధించి హిందీ టాపిక్ రాగా.. వేదికలపై తనకు హిందీ మాట్లాడటం అంటే భయమంటూ చెప్పుకోచ్చింది ఈ భామ. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర దర్శకులు రాజ్ అండ్ డీకే మాట్లాడుతూ.. ఈ సిరీస్ కోసం మొదట హిందీ మాట్లాడేవారినే తీసుకుందాం అనుకున్నాం. అందుకే వరుణ్ ధావన్‌ను హీరోగా తీసుకున్నాం. అయితే సమంతకు హిందీ వచ్చు అని తెలియదు. ఒక ఇంటర్వ్యూలో సమంత హిందీలో మాట్లాడటం చూసి చాలా షాకయ్యాము. దీంతో ఈ సిరీస్‌కు సమంత ఫర్ఫెక్ట్ రోల్ అని అప్పుడే డిసైడ్ అయ్యాం అంటూ రాజ్ అండ్ డీకే చెప్పుకోచ్చారు.
అయితే ఈ వ్యాఖ్యలపై సమంత తాజాగా స్పందించింది. సిటాడెల్ సిరీస్‌లో నాహనీ పాత్రకు హిందీ బాగా వస్తుంది. ఈ విషయాన్ని మీరు గుర్తించలేదు. నేను మాట్లాడేటప్పుడు ఉచ్చారణలో తప్పులు వస్తాయని భయంతో వేదికలపై హిందీ మాట్లాడను అంటూ సమంత చెప్పుకోచ్చింది. ఈ సిరీస్‌లో కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముందర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.