తెలుగు, హిందీలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది చెన్నై సుందరి సమంత (Samantha). ఈ భామ చేతిలో ప్రస్తుతం శాకుంతలం, ఖుషి, సిటడెల్ వెబ్ సిరీస్ ఉన్నాయి. వీటిలో విజయ్ దేవరకొండ హీరోగా శివనిర్వాణ దర్శకత్వంలో చేస్తున్న ఖుషి (Kushi) షూటింగ్ నయా షెడ్యూల్ ఫిబ్రవరిలో షురూ కానుందని, సామ్ కూడా చిత్రీకరణలో పాల్గొనబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఎప్పుడూ డేట్స్ విషయంలో సందిగ్ఢం నెలకొంటుండటంతో ఖుషి మూవీ షూటింగ్ డైలామాలో పడ్డది.
ప్రస్తుతం రాజ్-డీకేతో చేస్తున్న వెబ్‌సిరీస్ సిటడెల్ చిత్రానికి ఎన్ని డేట్స్ కావాలనే విషయంలో సమంతకు క్లారిటీ వచ్చిందట. ఈ నేపథ్యంలో డేట్స్ విషయంలో డైలామాకు చెక్ పడటంతో సమంత మార్చి మొదటి వారం నుంచి ఖుషి సినిమా కోసం అందుబాటులో ఉండనున్నట్టు డైరెక్టర్ శివనిర్వాణకు చెప్పినట్టు టాక్. ఈ ప్రకారం సమంత చెప్పిన సమయానికి సెట్స్‌కు వస్తే ఖుషి సినిమా షూటింగ్ పార్ట్ 20-30 రోజుల్లో పూర్తి కానుందని సమాచారం.
అయితే గతంలో పలుమార్లు ఇలాగే సమంత షూట్లో జాయిన్ అవబోతుందని వార్తలు వచ్చినా, అవన్నీ గాసిప్స్ గానే మిగిలిపోయాయి. మరి ఈ సారైనా సామ్ చెప్పిన సమయానికి చిత్రీకరణలో పాల్గొంటుందా..? అనేది చూడాలంటున్నారు సినీ జనాలు. విజయ్ దేవరకొండ మరోవైపు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో VD 12కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటిస్తోన్న శాకుంతలం ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.