Samantha| టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడ చక్కని అందం, ఆకట్టుకునే అందంతో ఈ భామ అందరి మనస్సులని కొల్లగొడుతూ ఉంటుంది. సమంత.. నాగ చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకొని అతని నుండి విడిపోయి ఇప్పుడు సోలోగా ఉంటుంది. నాగచైతన్యకు విడాకులిచ్చిన తర్వాత మయోసైటిస్ కు గురైన సమంత సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చింది. అయితే అంత పెద్ద వ్యాధిని కూడా ధైర్యంగా ఎదుర్కొన్న సమంత గెలిచింది. మయోసైటిస్ నుండి కోలుకున్న తర్వాత తిరిగి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తుంది. హైదరాబాద్ లో నివసించడం కూడా చాలావరకు తగ్గించి ముంబయిలోనే ఎక్కువగా నివసిస్తోంది.
ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.ఇదే సమయంలో సమంత చాలాకాలం తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది..ఈ సినిమాకు సమంతనే నిర్మాతగా వ్యవహరిస్తుండడం విశేషం..సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సమంత ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా సమంత బ్రైడల్ లుక్ పిక్స్ షేర్ చేసింది. ఈ పిక్స్ నెటిజన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
నార్త్ సైడ్ పెళ్లి కూతురి మాదిరిగా కనిపిస్తున్న సమంతని చూసి ఈ అమ్మడు రెండో పెళ్లి చేసుకోబోతుందా, అందుకే ఇలాంటి హింట్ ఇచ్చిందా అని ముచ్చటించుకుంటున్నారు. ఏది ఏమైన సమంత క్యూట్ లుక్స్ ప్రతి ఒక్కరి మనసులని దోచుకుంటున్నాయి. బాలీవుడ్ దర్శకుడు బాలీవుడ్ దర్శకుడు రాజు నిడుమోరుతో సమంత రిలేషన్లో ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నా దీనిపై క్లారిటీ రావడం లేదు. ఇటీవల వీరిద్దరు కలిసి చెట్టాపట్టాలు వేస్తున్నారు. మరి కొద్ది నెలలోనే వీరు పెళ్లి చేసుకోనున్నారనే టాక్ నడుస్తుంది.