Samantha | అక్కినేని ఫ్యామిలీ చిత్రానికి బెస్ట్ విషెస్ అందించిన సమంత.. మూవీ బ్లాక్ బస్టర్ అంటూ కామెంట్
Samantha | టాలీవుడ్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన డెకాయిట్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు షానియల్ డియో రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 10న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
Samantha | టాలీవుడ్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన డెకాయిట్ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. అడివి శేష్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు షానియల్ డియో రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 10న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై మంచి అంచనాలను పెంచాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ‘డెకాయిట్’ గురించే చర్చ నడుస్తోంది. చిత్ర బృందం కూడా దూకుడుగా ప్రమోషన్స్ నిర్వహిస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్ సమంత ఈ సినిమాకు తన బెస్ట్ విషెస్ తెలియజేయడం విశేషంగా మారింది. సోషల్ మీడియా వేదికగా ఆమె నిర్మాత సుప్రియ యార్లగడ్డను ఉద్దేశిస్తూ భావోద్వేగపూర్వకంగా పోస్ట్ పెట్టింది. సుప్రియ… నీ కృషి, పట్టుదల, సినిమాపై నీ అంకితభావాన్ని నేను దగ్గరగా చూశాను. బ్లాక్‌బస్టర్ విజయం కోసం నువ్వు అర్హురాలు. దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉండాలి. ‘డెకాయిట్’ టీమ్‌కు, అడివి శేష్, మృణాల్ ఠాకూర్లకు నా అభినందనలు” అంటూ సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొంది.ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా అక్కినేని కుటుంబానికి చెందిన ప్రాజెక్ట్‌కు సమంత శుభాకాంక్షలు తెలపడం నెటిజన్లలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. గతంలో నాగచైతన్యతో వివాహ బంధంలో ఉన్న సమంత, తర్వాత విడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ప్రొఫెషనల్‌గా ఇలా స్పందించడం ప్రశంసలు అందుకుంటోంది.
ఇక సినిమా విషయానికొస్తే, ‘డెకాయిట్’ ఒక రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పిస్తుండగా, యస్.యస్ క్రియేషన్స్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. సంగీతాన్ని భీమ్స్ సిసిరోలియో అందించగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను గ్యానీ కంపోజ్ చేస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేలో అడివి శేష్ కూడా భాగస్వామ్యం కావడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

