Samajavaragamana | నవ్వుల క్లాసిక్‌గా నిలిచిపోతుంది!
‘సామజవరగమన’ కథ చెప్పినప్పుడు ‘నువ్వు నాకు నచ్చావ్'లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నేడు నిజమైంది. సినిమా చూసి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు.
‘సామజవరగమన’ కథ చెప్పినప్పుడు ‘నువ్వు నాకు నచ్చావ్’లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నేడు నిజమైంది. సినిమా చూసి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు. ఆయన హీరోగా నటించిన ‘సామజవరగమన’ ఇటీవల విడుదలై ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.
ఈ సందర్భంగా చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ ‘సినిమా చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. యూఎస్‌లో మంచి కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా నవ్వుల క్లాసిక్‌గా నిలిచిపోతుంది. ఇలాంటి గొప్ప విజయం ఇచ్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అన్నారు. ఇది తనకు జీవితంలో మరిచిపోలేని సక్సెస్ అని, ఇలాంటి గొప్ప సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించినందుకు సంతోషంగా వుందని నిర్మాత రాజేష్ దండా తెలిపారు.
ఇటీవల తనకు అపజయం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో అందరూ సపోర్ట్ చేశారని, వారందరూ ఈసారి తనకు విజయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అందుకే ఇలాంటి విజయం దక్కిందని మరో నిర్మాత అనిల్ సుంకర చెప్పారు. ఈ వేడుకలో దర్శకుడు రామ్ అబ్బరాజు, హీరోయిన్ రెబా మోనికా జాన్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్‌రెడ్డి
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

