Sri Vishnu | నాన్‌స్టాప్‌గా నవ్విస్తుంది
‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’.
‘ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కు కూడా బాగా కనెక్ట్ అవుతుంది’ అన్నారు యువ హీరో శ్రీవిష్ణు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు పాత్రికేయులతో మాట్లాడుతూ ‘ప్రివ్యూ చూసిన వారు నాన్‌స్టాప్‌గా నవ్వుతూనే ఉన్నారు.
తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు రానటువంటి పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథలో ఊహించని మలుపులు ఉంటాయి. నేను తొలిసారి నటించిన ఫుల్‌లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నా. ఈ సినిమాలో నేను బాక్సాఫీస్ టికెట్ కౌంటర్ వద్ద పనిచేసే వ్యక్తిగా కనిపిస్తా. నా మాటల్లో సినిమాలకు సంబంధించిన డైలాగ్స్ ఉంటాయి. అందరి హీరోల డైలాగ్స్‌ను చెప్పాను. ప్రస్తుతం హర్ష దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌లో ఓ సినిమా చేస్తున్నా. అలాగే ‘రాజరాజ చోర’ చిత్రానికి సీక్వెల్ సన్నాహాలు జరుగుతున్నాయి’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

