RAPO23 | టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడని తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం RAPO23 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనుంది. ఇటీవలే పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. తాజాగా మూవీ లవర్స్, అభిమానులకు ఆసక్తికర వార్తను షేర్ చేసింది రామ్. పాపులర్ కంపోజర్ శ్యామ్ సీఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేయబోతున్నాడు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ స్పెషల్ గ్లింప్స్‌ను షేర్ చేశారు.
ఈ చిత్రాన్ని RaPo సినిమాటిక్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి తిరు సినిమాటోగ్రఫర్ కాగా.. పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. ఇప్పటిదాకా లవర్ బాయ్, యాక్షన్ హీరోగా డ్యుయల్ రోల్ పోషించిన రామ్ ఇక డైరెక్టర్ కమ్ యాక్టర్‌గా రాబోతున్న సినిమాను ఎలా హ్యాండిల్ చేయబోతున్నాడని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు.
Every world has its own sound.
This one breathes mayhem. ❤️🔥Welcoming @SamCSmusic on board to score the intense world of #RAPO23 💥🎵
Starring Energetic Star @ramsayz 🐺🖤
Written & Directed by #𝙍𝘼𝙋𝙊
Produced by Krishna Pothineni
A… pic.twitter.com/1wxOKkYqeP— RAPO Cinematics (@RAPO_Cinematics) July 7, 2026