Salman Khan | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన నిద్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన మేనల్లుడు అర్హన్ ఖాన్ నిర్వహించిన డంబ్ బిర్యానీ అనే పాడ్‌కాస్ట్‌లో చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు సల్మాన్ ఖాన్. ఈ పాడ్‌కాస్ట్‌లో భాగంగా సల్మాన్ మాట్లాడుతూ.. తాను జైలులో ఉన్నప్పుడే ఎక్కువగా నిద్రపోయినట్లు వెల్లడించాడు.
నాకు సాధారణంగా అందరిలాగా నిద్రపట్టదు. పడుకుంటే గంటన్నర లేదా రెండు గంటలు అంతే నిద్రపోతాను. ఆపై ఏదో ఒక రోజు నెలకు ఒకసారి, ఏడు గంటలు నిద్రపోతాను. షూటింగ్లో టైంలో దొరికినప్పుడు షాట్ల మధ్య నిద్రపోతాను. షూటింగ్లలో కుర్చీలపై పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే నేను ఎక్కువగా నిద్రపోయిందంటే జైలులో ఉన్నప్పుడే. అక్కడ అయితే ఏ ఇబ్బంది లేకుండా 8 గంటలు నిద్రపోయేవాడిని. నేను ఏం చేయాలనే ప్రదేశాలలో ఉన్నప్పుడు నిద్ర మాత్రమే పోతాను అంటూ చెప్పుకోచ్చాడు.
1998లో సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం హమ్ సాథ్ – సాథ్ హై (Hum saath saath hain). ఈ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ తన బృందంతో కలిసి కృష్ణ జింకలను అక్రమంగా వేటాడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సల్మాన్ ప్రమేయం ఉన్నందున అతడికి కోర్టు జైలు శిక్ష విధించింది.