హిందీ బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నందుకు తాను వెయ్యి కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నాననే వార్తల్లో నిజం లేదన్నారు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్. ఒక షో హోస్ట్ చేస్తున్నందుకు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తే ఇక జీవితంలో ఏ పనీ చేయనక్కర్లేదని చెప్పారు. ‘బిగ్ బాస్ సీజన్ 16’ లాంఛ్ కార్యక్రమంలో సల్మాన్ మాట్లాడుతూ…‘ఈ షో కోసం నేను తీసుకుంటున్న రెమ్యునరేషన్ గురించి వచ్చే వార్తల్లో నిజం లేదు. వెయ్యి కోట్ల రూపాయలు కాదు కదా అందులో నాలుగో వంతు కూడా తీసుకోవడం లేదు. అయితే ఏదో ఒకరోజు అంత మొత్తం అందుకుంటా. నాకూ ఖర్చులు ఉంటాయి. నా లాయర్లకు భారీ మొత్తాలు చెల్లించాలి అన్నారు.