సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘టైగర్-3’. ఈ సినిమాలో షారుఖ్‌ఖాన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. సక్సెస్ఫుల్ ఫ్రాంఛైజీ టైగర్, టైగర్ జిందాహై సిరీస్‌లో మూడో సినిమాగా ‘టైగర్-3’ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని దీపావళి పర్వదినం రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. శనివారం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్ భారీ గన్స్ చేతబట్టుకొని యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో వీరిద్దరూ గూఢచారి పాత్రల్ని పోషిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ‘టైగర్-3’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మనీష్ శర్మ దర్శకుడు. నవంబర్ 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.