బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వెబ్ సిరీస్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. యాక్షన్ ఎంటర్టైనర్గా సాగే వెబ్ సిరీస్కు సల్మాన్ అంగీకారం తెలిపారని ఆయన బృందం వెల్లడించింది. సల్మాన్ టీమ్ స్పందిస్తూ…‘వెబ్ సిరీస్లను సల్మాన్ బాగా ఇష్టపడుతుంటారు. ఆయనకు ఓటీటీలో అడుగుపెట్టాలనే కోరిక ఉంది. ఇటీవలే ఓ వెబ్ సిరీస్కు అంగీకారం తెలిపారు. యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. దర్శకుడు, ఇతర చిత్రబృందం వివరాలు ప్రస్తుతానికి గోప్యంగా ఉన్నాయి. సల్మాన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తయ్యాక ఈ వెబ్ సిరీస్ సెట్స్ మీదకు వెళ్తుంది’ అని తెలిపారు.