బుధవారం 03 జూన్ 2020
Cinema - Apr 24, 2020 , 09:52:35

ట్విట్ట‌ర్‌లో స‌రికొత్త రికార్డ్‌ క్రియేట్ చేసిన స‌ల్మాన్

ట్విట్ట‌ర్‌లో స‌రికొత్త రికార్డ్‌ క్రియేట్ చేసిన స‌ల్మాన్

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కి రికార్డులు కొత్తేమి కాదు. బ‌రిలో దిగాడంటే రికార్డుల వేట మొద‌లు పెడ‌తాడు. తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్‌లో స‌రికొత్త రికార్డ్ సృష్టించాడు. తన ట్విట్టర్ ఖాతాలో అఫీషియల్ గా 40 మిలియన్ల ఫాలోవర్స్ కలిగిన రెండో సినీ సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేసాడు.

ఇప్పటివరకు ట్విట్టర్లో 41.49 మిలియన్ల ఫాలోయింగ్ తో బిగ్ బి అమితాబ్ బచ్చన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయ‌న త‌ర్వాతి స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు. తాజాగా స‌ల్మాన్ ఫాలోవ‌ర్స్ 40మిలియన్ల మార్క్ చేరుకోవ‌డంతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక సల్మాన్  తర్వాత 3వ స్థానంలో షారుఖ్ ఖాన్(39.9మిలియన్స్) ఉన్నారు. ప్ర‌స్తుతం ప‌న్వెల్ ఫాం హౌజ్‌లో ఉన్న స‌ల్మాన్ ఖాన్ అక్క‌డి ప‌రిస్థితుల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో షేర్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. కాగా ప్ర‌స్తుతం కబీ ఈద్ కబీ దివాలి, బుల్బుల్ మ్యారేజ్ హాల్, రాధే అనే చిత్రాలు చేస్తున్నాడు స‌ల్మాన్


logo