టైటిల్ చూడగానే షాక్ అయ్యారా? సల్మాన్ అభిమానులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోటోను చూసి ఇలాగే షాక్ అవుతున్నారు. సల్లూ భాయ్ మాకు చెప్పకుండా ఇంత సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడా అంటూ సల్మాన్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
కానీ.. అసలు విషయం ఏంటంటే.. సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకున్నట్టుగా ఫోటోషాప్ చేసిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు. ఆ ఫోటోను చూసి సినీ అభిమానులు అవాక్కవుతున్నారు.
నిజానికి.. సల్మాన్ ఖాన్, సోనాక్షి సిన్హా మధ్య మంచి అనుబంధమే ఉంది. సోనాక్షి సిన్హా.. సల్మాన్ మూవీ దబాంగ్తోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 2010లో వచ్చిన దబాంగ్ సినిమాతోనే సోనాక్షి సినీరంగంలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి వాళ్ల మధ్య మంచి రిలేషన్‌షిప్పే ఉంది.
దాన్నే అదునుగా తీసుకొని వేరే వాళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలో సల్మాన్, సోనాక్షి ఫోటోలను మార్ఫింగ్ చేశారు. సల్మాన్.. సోనాక్షికి రింగ్ తొడుగుతున్నట్టుగా ఆ ఫోటోలో ఉంటుంది. ఆ ఫోటో చూస్తే పక్కా ఇది ఫోటోషాప్ చేసిన ఫోటోలా కనిపిస్తుంది. ఇది నిజమైన ఫోటో కాదు.. ఫోటోషాప్ చేసిన ఫోటో అని తెలుసుకొని నెటిజన్లు అప్పుడు ఊపిరిపీల్చుకున్నారు.
సల్మాన్ గత కొన్ని ఏళ్ల నుంచి రొమేనియాకు చెందిన మోడల్, టెలివిజన్ ప్రజెంటర్, సింగర్ వాంటుర్తో డేటింగ్ చేస్తున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. అయితే.. వాళ్ల రిలేషన్‌షిప్‌పై ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ పెదవి విప్పలేదు.
మరోవైపు సోనాక్షి సిన్హా.. నోట్‌బుక్ స్టార్ జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన రిలేషన్‌షిప్‌పై సోనాక్షి కూడా ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు.